- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్‌పై భర్త శ్రీధర్ రియాక్షన్ ఇదే..!
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం జగన్‌ను కానీ, పార్టీ లైన్‌ను కానీ ధిక్కరించే ధైర్యం, సాహసం తాము చేయలేదని సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డా. శ్రీధర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో భార్యతో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం అప్రతిష్టపాల్జేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశారో చెప్పకుండానే శిక్ష విధించారని అన్నారు. ఎమ్మెల్యే ఉండగా ఆ స్థానంలో మరొకరిని నియమించడం.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లొద్దని ఆంక్షలు విధించడం వంటి అంశాలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ లేదని చెబితే తలతీసినట్లు అవుతుందని, అయినప్పటికీ పార్టీ లైన్ దాటలేదని వివరణ ఇచ్చారు.
రహస్య బ్యాలెట్ జరిగితే ఇతరులకు ఓటు వేశారని ఎలా తెలిసిందని శ్రీధర్ ప్రశ్నించారు. ఎవరికి ఓటు వేశారో చెప్పడం.. అడగడం తప్పేనని అభిప్రాయపడ్డారు. అలాగే ఆధారాలు లేకుండా మాట్లాడటం మరింత తప్పు అని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డా. శ్రీధర్ వ్యాఖ్యానించారు. టికెట్ ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమను సంప్రదించారని గుర్తు చేశారు. టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నారని, అయితే కాపు ఓటర్లను ఆకర్షించేలా ప్రయత్నాలు చేయాలని ఆదేశించారన్నారు. 15 వేల కాపు ఓటర్లు ఉంటే 10 వేల ఓటర్లు తమకు ఓటు వేశారని స్పష్టం చేశారు. ఈ గెలుపును చూసి జగన్ కూడా ఆశ్చర్య పోయారని, అలాంటి తమను అవమానించేలా వ్యవహరించడం బాధించిందన్నారు.
హైదరాబాద్‌లో తమకు రెండు ఆస్పత్రులు ఉన్నాయని...అలాంటి తాము రూ.10 కోట్లకు అమ్ముడుపోతామా? అని ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే తమ పిల్లలు సైతం చూసి భయపడిపోతున్న పరిస్థితి ఉందని డా. శ్రీధర్ చెప్పారు.