- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavy Rains: ఏలూరు జిల్లాలో వరద విధ్వంసం... భారీగా నష్టం
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షానికి పెద్ద చెరువుకు గండి పడింది. దీంతో ఈ వరద నీరు ఏల్లూరు జిల్లా వేలేరుపాడు మండలంలో బీభత్సం సృష్టించింది. వరద ఉధృతికి ఇల్లు కూలిపోయాయి. పంటల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లన్నీ కూలిపోయాయి. వరదలో పశువులు సైతం కొట్టుకుపోయాయి. రోడ్లు తెగిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో సామన్లు మొత్తం పాడైపోయాయి. వేలాది ఎకరాల పొలాల్లో వరద నీళ్లు చేరడంతో పూర్తిగా నాశనం అయ్యాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచినీళ్లు సైతం దొరకడం లేదు. ఎటు చూసిన కొట్టుకుపోయిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయ కలుగుతోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అన్నం వండుకునేందుకు సైతం పొడి స్థలం లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు తినడానికి తిండి, తాగడానికి నీరు ఇవ్వాలని కోరుతున్నారు.