రాష్ట్రంలో శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్‌తో హోంమంత్రి అనిత చర్చలు

by Mahesh |   ( Updated:2024-10-29 15:55:26.0  )
రాష్ట్రంలో శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్‌తో హోంమంత్రి అనిత చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఇదే విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత(Home Minister Anita) రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ( Deputy CM Pawan)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చించారు. అలాగే దీపావళి(Diwali) నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లను డిప్యూటీ సీఎంకు హోంమంత్రి అనిత వివరించారు. ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పవన్ తెలిపారు. అలాగే ఈ పండుగకు రాష్ట్రంలో పర్యావరణహిత టపాసులు(Environmentally friendly tapas) వినియోగించాలని సూచించారు. దీంతో పాటుగా ఇటీవల కాలంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైన క్రమంలో.. రాష్ట్రంలో విమానాలకు బాంబు బెదిరింపులపై హోంమంత్రిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే డయేరియా పవన్ వివరాలు అడగ్గా.. విజయనగరం జిల్లాలోని గుర్లలో డయేరియా పూర్తిగా అదుపులోకి తెచ్చామని తెలిపారు. అలాగే నేరాల నియంత్రణలో మొబైల్ ఫోన్ లు వాడాలని ప్రజల భాగస్వామ్యాన్ని కోరిన విధానాన్ని డిప్యూటీ సీఎం ప్రశంసించినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story