- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాస్తవాలు మాట్లాడాలి.. రోజాకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్:క్షేత్ర స్థాయిలో తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలని మాజీ మంత్రి రోజా(Former minister Roja)కి హోంమంత్రి అనిత(Home Minister Anita) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడ వరద(Vijayawada flood) సాయం, సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాలనపై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. విజయవాడ వరదల్లో ఎవరు కష్టపడ్డారో ప్రజలందరికి తెలుసు అని హోంమంత్రి వ్యాఖ్యానించారు. రోజా నోటికి హద్దు అదుపు ఉండదని ఎద్దేవా చేశారు. రెండు రోజులు ఏపీలో ఉంటే మిగిలిన రోజులు తమిళనాడు, కర్ణాటకలో ఉంటారని విమర్మించారు. రెడ్‌బుక్‌లో తమ పేర్లు ఉన్నాయని కొందరు వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు.
ఇక తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి విక్రయాల కట్టడిపై చర్చించారు. స్మార్ట్ పోలీసింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటిని సైతం సమన్వయం చేస్తామని చెప్పారు. నేరాలు నియంత్రణకు, ప్రజల భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామన్నారు. ఎర్రచందనం కట్టడికి ప్రత్యేమైన చర్యలు చేపట్టామని హోంమంత్రి అనిత తెలిపారు.