హైకోర్టులో సజ్జల భార్గవ్ పిటిషన్.. విచారణ వాయిదా

by srinivas |
హైకోర్టులో సజ్జల భార్గవ్  పిటిషన్.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. సోషల్ మీడియాలో యాక్టివిస్టుగా ఉన్న సజ్జల భార్గవ్.. గత ఐదేళ్లలో ప్రతి పక్షనాయకులపై సో షల్ మీడియలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని భీమవరం, కదిరి పీఎస్‌లలో నమోదైన కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత సైతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని భార్గవ్ ఆరోపణలున్నాయి. దీంతో హైకోర్టును భార్గవ్ ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును సజ్జల భార్గవ్‌రెడ్డి కోరారు.

Advertisement

Next Story