- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీవారి లడ్డూ వివాదం.. హీరో సుమన్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: తిరుమ శ్రీవారి లడ్డూ(Tiruma Srivari Laddu)లో వినియోగించిన నెయ్యి కల్తీ(Ghee adulterated) అయినట్లు నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హీరో సుమన్ (Hero Suman)సైతం హాట్ కామెంట్స్ చేశారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని సూచించారు. లడ్డూలో కల్తీ జరుగుతుంటే టీటీడీ బోర్డు (Ttd Board) ఏం చేస్తోందని ప్రశ్నించారు. దేవుడి ప్రసాదం కల్తీ చేయడం మహా పాపమని చెప్పారు. లడ్డూ అంటే ఒక సెంటిమెంట్ అని, కల్తీ చేసిన వాళ్లను అసలు వదలొద్దని తెలిపారు. భారత్‌లో ఎన్నో మతాలు ఉన్నాయని, ఆయా ప్రసాదాలు చాలా పవిత్రమైనవన్నారు. ప్రసాదాలు కల్తీ చేసే వాళ్లను కచ్చితంగా జైలుకు పంపాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘‘శ్రీవారి లడ్డూను కల్తీ చేయడం చాలా పెద్ద తప్పు. హిందువలకు అవమానం. ’’ అని సుమన్ పేర్కొన్నారు.