- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్ఫ్‌కు వెళ్లిన వారి కోసం హెల్ప్ డెస్క్
by Sathputhe Rajesh |
X
దిశ, కడప: గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే ఆదుకునేందుకు అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వీ హర్షవర్థన్ రాజు తెలిపారు. మంగళవారం రాయచోటిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ హెల్ప్ లైన్ నంబర్ 8688830014ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గల్ఫ్‌లో ఒక పని కోసం వీసాతో వెళ్తే ఇంకొక పని చేయించడం, మహిళలను ఇబ్బందులకు గురి చేయడం వంటి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇక్కడ వారి బంధువులు పోలీస్ స్టేషన్ వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులుంటే స్వదేశానికి తిరిగి తీసుకొస్తున్నామన్నారు. విదేశాలకు వెళ్లే ముందు ఈ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి పోలీస్ వారి సలహాలు సూచనలు పొందాలని కోరారు.
Advertisement
Next Story