వాగు దాటి.. అతి కష్టం మీద పెన్షన్ పంపిణీ

by srinivas |   ( Updated:2024-08-03 05:20:17.0  )
వాగు దాటి.. అతి కష్టం మీద పెన్షన్ పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పెన్షన్ పంపిణీకి అధికారులు సాహసం చేస్తున్నారు. పెదబయలు మండలం గిన్నెలకోట వద్ద వాగు ఉధృతిగా ప్రవస్తోంది. దీంతో గిరిజన గ్రామాలకు వెళ్లేందుకు సచివాలయం సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. తాడు సాయంతో వాగు దాటి అవతలికి చేరుకుని లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు.

మరోవైపు వర్షాల దెబ్బకు జిల్లాలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ సిబ్బంది సైతం సాహసం చేయాల్సి వచ్చింది. వాగు దాటి గ్రామాలకు వెళ్లి విద్యుత్‌ను పునరుద్ధరించారు. దీంతో విద్యుత్ సిబ్బందిపై ప్రసంశలు కురుస్తున్నాయి.

Advertisement

Next Story