Heavy Rains:ఏపీలో కుండపోత వర్షాలు..చెరువులను తలపిస్తున్న పొలాలు

by Jakkula Mamatha |
Heavy Rains:ఏపీలో కుండపోత వర్షాలు..చెరువులను తలపిస్తున్న పొలాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న(శుక్రవారం)తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, రావులపాలెం, రంపచోడవరం, గోకవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నరసాపురం, కొత్తపేట సహా మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డు నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి. నేడు (శనివారం) మన్యం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కోనసీమ, విజయనగరం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Advertisement

Next Story