Heavy Rain Alert:దూసుకొస్తున్న తుఫాన్.. రాష్ట్రంలో నాలుగు రోజులు భారీ వర్షాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-23 02:07:49.0  )
Heavy Rain Alert:దూసుకొస్తున్న తుఫాన్.. రాష్ట్రంలో నాలుగు రోజులు భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తున్నాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains ) రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేడు తుఫాన్‌(storm)గా బలపడనుందని వాతావరణ శాఖ(Meteorological Department ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో 23, 24వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department ) అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, బెంగాల్, తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం నేడు(బుధవారం) తుఫానుగా, రేపు తీవ్ర తుఫానుగా బలపడొచ్చని పేర్కొంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100-110 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Advertisement

Next Story