- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
దిశ, ప్రతినిధి, విజయవాడ : ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ. వాయవ్య దిశగా పయనించి పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వీటితో పాటు బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యల కోసం మూడు ఎస్టీఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు.వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.