ఏలూరు జిల్లాలో భారీగా వర్షం..ఉప్పొంగిన వాగులు, వంకలు

by srinivas |
ఏలూరు జిల్లాలో భారీగా వర్షం..ఉప్పొంగిన వాగులు, వంకలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో కుక్కునూరు, వేలేరుపాడులో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. వాదీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. వేలేరుపాడు- అశ్వారావు పేట ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. కుక్కునూరు మండలంలో గుండేటి వాగు, పాలవాగు, వెంకటాపురం వాగులతో పాటు చిన్న చిన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గుండేటి వాగు కల్వర్ట్ వరద నీటిలో మునిగిపోయింది. పెదరావిగూడెంలోని కాలనీ నీట మునిగింది. రాళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 15 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed