చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Seetharam |   ( Updated:2023-11-15 06:01:26.0  )
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ బెయిల్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బుధవారం విచారణ ప్రారంభమవుతుండగానే సీఐడీ తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం2.15 గంటలకు విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే మధ్యాహ్నాం సీఐడీ అధికారులు అదనపు అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఐడీ దాఖలు చేయనున్న అదనపు అఫిడవిట్‌పై విచారణ జరిపి రెగ్యులర్ బెయిల్‌పై తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed