సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ

by Shiva |   ( Updated:2024-01-19 12:11:45.0  )
సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్రమాస్తుల కేసులో సీఎం జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, కేసుకు సంబంధించి విచారణను మరో ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. జగన్ బెయిల్ రద్దు, కేసు ట్రాన్స్‌ఫర్ విషయంలో జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు సర్వ్ చేసింది. అదేవిధంగా అక్రమాస్తుల కేసులో ఇన్వెస్టిగేషన్ ఎందుకు లేట్ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం కోరింది.

Read More..

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఆ భూముల వ్యవహరంలో కీలక తీర్పు

Advertisement

Next Story

Most Viewed