Cm Chandrababu: తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

by srinivas |   ( Updated:2024-10-30 10:33:10.0  )
Cm Chandrababu: తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయుడు దీపావళి(Diwali) శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర వధ తర్వాత ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇదని ఆయన పేర్కొన్నారు. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ (Deepam2 In AP)పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నామని చెప్పారు. తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్ల(Gas Cylinders)ను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యమన్నారు. అర్హులైన ఆడబిడ్డలు ఇప్పటికే ‘దీపం 2.0’ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఇది సంతోషం కలిగించే విషయమని, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే స్ఫూర్తిని పొందుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజల జీవితంలో ఈ ఆనంద దీపావళి కొత్త వెలుగు నింపాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed