Bjp: ఎంపీ జీవీఎల్‌కు వారణాసిలో కీలక పదవి

by srinivas |
Bjp: ఎంపీ జీవీఎల్‌కు వారణాసిలో కీలక పదవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: వారణాసి కాశీ తెలుగు సమితి గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షుడిగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో కె.నరసింహమూర్తి అధ్యక్షతన కాశీ తెలుగు సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న గంగా పుష్కరాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై తీసుకోవాలసిన చర్యలపై పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఈ సమావేశంలో శ్రీ గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షుడిగా జీవీఎల్ నర్సింహారావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే కాశీ తెలుగు సమితి ఉపాధ్యక్షుడిగా వి.సుబ్రహ్మణ్యం(మణి), కార్యదర్శిగా వి.వి.సుందర్ శాస్త్రి, జాయింట్ సెక్రటరీగా టి.గజానన్ జోషిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పవిత్ర గంగా పుష్కరాల సందర్భంగా జరగాల్సిన వివిధ సాంస్కృతిక, మరియు ధార్మిక కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed