Ycp Mlc అభ్యర్థులకు సీఎం జగన్ కీలక సూచనలు

by srinivas |   ( Updated:2023-02-20 12:12:07.0  )
Ycp Mlc అభ్యర్థులకు సీఎం జగన్ కీలక సూచనలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ జాబితాను విడుదల చేయడంతో సీఎం జగన్‌తో ఆ నేతలు భేటీ అయ్యారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. తాను చేయాల్సింది చేశానని, ఇక గెలుపు బాధ్యత తమదేనని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని పేర్కొన్నారు. పదవులు పొందిన వారు యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సీఎం జగన్ సూచించారు.

కాగా 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. స్థానిక సంస్థల కోటా నుంచి 9, ఎమ్మెల్యే కోటా నుంచి 7 గవర్నర్ కోటా నుంచి మరో ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేశారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సామాజికన్యాయానికి పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ-11 ఓసీ-4, ఎస్సీలు-2, ఎస్టీ-1 స్థానాలను కేటాయించారు. అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

స్థానిక సంస్థల కోటా:

1) నర్తు రామారావు

2) కుడిపూడి సూర్యనారాయణ

3) వంకా రవీంద్రనాథ్

4)కవురు శ్రీనివాస్

5) మెరుగ మురళి

6) డా. సిపాయి సుబ్రమణ్యం

7) రామసుబ్బారెడ్డి

8) డాక్టర్ మధుసూధన్

9) ఎస్ మంగమ్మ

ఎమ్మెల్యే కోటా:

1) పీవీవీ సూర్యనారాయణరాజు

2) పోతుల సునీత

3) కోలా గురువులు

4) బొమ్మి ఇజ్రాయెల్

5) ఏసు రత్నం

6) మర్రి రాజశేఖర్

7) జయమంగళ వెంకటరమణ

గవర్నర్ కోటా:

1) కుంబా రవిబాబు

2) కర్రి పద్మశ్రీ

Advertisement

Next Story