- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ట్రాన్స్‌జెండర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్
దిశ,డైనమిక్ బ్యూరో: ట్రాన్స్‌జెండర్లకు వైసీపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సరికొత్త పాలసీని రూపొందించింది. ఇందుకోసం ట్రాన్స్‌జెండర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ట్రాన్స్ జెండర్లకు మంచి వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని నిర్ణయించింది. ట్రాన్స్ జెండర్లకు సామాజిక భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను జారీ చేయనుంది.
ఇప్పటికే బడ్జెట్‌లో రూ.2 కోట్లు
ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 2 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే నవరత్నాల ద్వారా హిజ్రాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ట్రాన్స్ జెండర్ల భవిష్యత్ కోసం మరికొన్ని చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ట్రాన్స్ జెండర్లు నివసించే ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పించడంతోపాటు వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి : చింతలపూడి టీడీపీలో అలజడి