Tragedy: ఇద్దరి ప్రాణాలు తీసిన ఈత సరదా

by srinivas |   ( Updated:2023-03-30 14:37:26.0  )
Tragedy: ఇద్దరి ప్రాణాలు తీసిన ఈత సరదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: పల్నాడు జిల్లా పెదకూరపాడులో పండుగ పూట విషాదం నెలకొంది. అమరావతి వద్ద కృష్ణా నదిలో సరదాగా ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామానికి చెందిన కేసర రాజశేఖర్ రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి కృష్ణా నదిలో ఈతకొట్టేందుకు దిగారు. అయితే ఒక్కసారిగా ఇద్దరూ మునిగిపోయారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. పండగపూట పిల్లలు మృత్యువాతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story