- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mangalagiri: స్పందన రోజునే వార్డు సచివాలయం మూసివేత
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు సుపరిపాలన అందించడంతోపాటు మరిన్ని సేవలను ప్రజల చెంతకు చేరవేయాలనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థ సచివాలయం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకు వందలాది సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చారు. అలాంటి వ్యవస్థకు కొన్ని చోట్ల అధికార యంత్రాంగం తూట్లు పొడుస్తుంది. ముఖ్యంగా స్పందన కార్యక్రమం రోజున కూడా మూసేస్తున్నారు.
ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్న సచివాలయ వ్యవస్థ తీరు గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. మంగళగిరి టౌన్ మున్సిపల్ కాంపెక్స్ సెంటర్‌లోని 8వ వార్డు సచివాలయం మధ్యాహ్నం మూసి వేసి ఉంది. సిబ్బంది ఎటు వెళ్లిపోయారో తెలియదు గానీ ఒక్కరు కూడా ప్రత్యక్షం కాలేదు. ఈ సచివాలయంలోనే ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ సెంటర్ కూడా ఉంది. దీంతో ఆధార్ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారంతా తిరిగి వెళ్లిపోయారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.