మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫోన్.. వెనక్కి తగ్గిన ఆర్టీసీ ఉద్యోగులు

by srinivas |
మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫోన్.. వెనక్కి తగ్గిన ఆర్టీసీ ఉద్యోగులు
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి ఫోన్‌తో ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) ఉద్యోగుల నిరసనలు వాయిదా పడ్డాయి. ఉద్యోగ భద్రత సర్క్యులర్ యథావిధిగా అమలు చేయడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్(RTC Employees Union) డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19, 20 తేదీన ఆర్టీసీ డిపోలు, వర్క్ షాపుల వద్ద ధర్నాలకు పిలుపు నిచ్చింది. ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని నిర్ణయించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగుల నిరసనల పట్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈయూ రాష్ట్ర అధిక్షుడికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad Reddy) ఫోన్ చేశారు. సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. దీంతో నిరసనలు వాయిదాలు వేస్తున్నట్లు ఈయూ ప్రకటించింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి చొరవతో ఈయూ ధర్నాలు వాయిదా వేసుకోవడంతో ఆయన్ను తోటి మంత్రులు ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed