- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Palnadu: ఒకే చోట లోకేశ్, పవన్.. ఆసక్తికరంగా ఫ్లెక్సీ
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పెదకూర పాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెక్సీలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా లింగంగుంట గ్రామంలో స్వాగతం పలుకుతూ తోరణాలు కట్టారు. నారా లోకేశ్, పవన్ కల్యాణ్ సారథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయా అనే విధంగా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుపై రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. యువగళం పేరుతో లోకేశ్, వారాహి యాత్రతో పవన్ కల్యాణ్ జనంలో తిరుగుతున్నారు. ప్రస్తుతం బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందని పలుమార్లు పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ నేతలు సైతం చెప్పారు. అయినా 2014 ఎన్నికల మాదిరిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కొనసాగుతోంది. లింగంగుంట గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీలను చూస్తే అటు టీడీపీ, జనసేన అభిమానులు సైతం ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి పార్టీ అభిప్రాయాలు అధికారికంగా ప్రకటించకపోయినా కార్యకర్తలు మాత్రం కలిసి పని చేయాలని కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. నాలుగు రోజులుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు. అంతేకాదు అన్ని వర్గాలను కలుస్తున్నారు. ముఖాముఖిలు నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. పలు హామీలు ఇస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.