- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guntur: రూ.10 లక్షల విలువైన సుగంధ ద్రవ్యాలు కొట్టేశారు..
దిశ, వెబ్ డెస్క్: గుంటూరులో కేటుగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆన్‌లైన్ బిజినెస్ పేరుతో రూ. 10 లక్షల విలువైన సుగంధ ద్రవ్యాలు కొట్టేశారు. డ్రైప్రూట్ కంపెనీ పేరుతో నకిలీ పత్రాలు పెట్టి యాలుకలు ఆర్డర్ చేశారు. రైల్వే పార్శిల్ సర్వీస్ నుంచి 500 కేజీల యాలుకలు, లవంగాలు, తదితర పదార్థాలు తీసుకున్నారు. ఘటనపై బాధితులు రైల్వే పోలీసులకు కేరళకు చెందిన వ్యాపారులు ఫిర్యాదు చేశారు. పోగొట్టుకున్న సొమ్ము కోసం వారం రోజులుగా గుంటూరులో పడిగాపులు కాస్తున్నారు. గుంటూరు నుంచి కేరళలోని త్రిసూర్‌లో వ్యాపారులకు ఆన్ లైన్ ద్వారా యాలుకలు, లవంగాలు ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ ప్రకారం రైల్లో యాలుకలు, లవంగాలు పంపించారు. ఎంతకీ తిరిగి సమాచారం అందకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్నారు. వెంటనే గుంటూరుకు చేరుకుని ఆరా తీశారు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.