Tdp: చంద్రబాబుకు భద్రత కల్పించండి..

by srinivas |
Tdp: చంద్రబాబుకు భద్రత కల్పించండి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాల పర్యటన నేపథ్యంలో అదనపు భద్రత కల్పించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డీజీపీకి లేఖ రాశారు. ఈనెల 18 నుంచి చంద్రబాబు నాయుడు కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాలలో పర్యటించనున్నారు. 18న కడప, 19న ప్రకాశం జిల్లా గిద్దలూరు, 20న మార్కాపురం, 21న ఎర్రగొండపాళెంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు పుట్టునరోజు కావడంతో మార్కాపురంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడి సమావేశాలపై రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులు టార్గెట్ చేసే ప్రమాదం ఉందని. కావున అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలి అని కోరారు. చంద్రబాబు నాయుడి పర్యటనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story