- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu Arrest: టీడీపీ ‘కాంతితో క్రాంతి’కి అనూహ్య స్పందన.. ఏపీ, తెలంగాణలో వెల్లువెత్తిన నిరసన
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న విషయం తెలిసింది. అయితే చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ శ్రేణులు ప్రతినిత్యం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ‘కాంతితో క్రాంతి ’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లల్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా‘కాంతితో క్రాంతి’ పేరుతో రాజమండ్రిలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేశ్ దీపాలు వెలిగించిన నిరసన వ్యక్తం చేశారు.
ఇక టీడీపీ అభిమానులు సైతం కొవ్వొత్తులు వెలిగించి, మొబైల్ టార్చ్ వేసి నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్ వద్ద దీపాలు వెలిగించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిరసన వ్యక్తం చేశారు. ఇటు హైదరాబాద్‌లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మణికొండ చౌరస్తా నుంచి ల్యాంకోహిల్స్ వరకు టీడీపీ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు తెలంగాణలోనూ చంద్రబాబుకు మద్దతుగా అభిమానులు కొవ్వుత్తుల ర్యాలీలు నిర్వహించారు. అటు బెంగళూరు, చెన్నైలోనూ లైట్లు ఆపి దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.