- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధారాలు లేకుండానే చంద్రబాబుపై కేసు: Atchannaidu
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్, సీఐడీపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తమ అధినేతపై స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాస్తవాలు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగిందని చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ దోపిడీని ప్రశ్నిస్తే చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టి జైలు పాలు చేశారని ఆక్షేపించారు. స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ఏఏజీ నెల రోజుల తర్వాత చావు కబురు చల్లాగా చెప్పారని ఎద్దేవా చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళితే ఆయనకు సంబంధం లేదని ప్రభుత్వమే చెప్పిందని అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 160 సీట్లు వస్తాయనుకున్నామని.. కాని జగన్ చేస్తున్న తప్పులతో టీడీపీకి 175 సీట్లు రావడం ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.