ఏపీలో గణనీయంగా తగ్గిన పేదరికం

by srinivas |
ఏపీలో గణనీయంగా తగ్గిన పేదరికం
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన పేదరికం తగ్గిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తాజా మల్టీ-డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఆశాజనకమైన అభివృద్దిని సూచించిందని ఆయన చెప్పారు. రాష్ట్ర జనాభాలో కేవలం 6 శాతం మంది మాత్రమే పేదరికంలో ఉన్నారని ఆ నివేదిక వెల్లడించిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో లబ్దిదారులకు ఆహార పంపిణీ, గృహ నిర్మాణం, డీబీటీ ద్వారా నగదు బదిలీ జరగడం పేదరిక నిర్మూలనకు బాటలు వేశాయన్నారు. అయితే తదుపరి సర్వే నాటికి రాష్ట్రంలో పేదరికం ఒక శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed