రేపటి నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్‌’.. సజ్జల కీలక వ్యాఖ్యలు

by srinivas |
రేపటి నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్‌’.. సజ్జల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలకు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పారు. సంక్షేమం ద్వారానే అభివృద్ధి అని నిరూపించామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. టీడీపీ పాలనలో తలసరి ఆదాయంలో రాష్ట్రం 17వ స్థానంలో ఉందని చెప్పారు. ప్రస్తుతం 9 స్థానానికి తీసుకొచ్చామని పేర్నొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల 93 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కోవిడ్ సమయంలో దేశంలోనే ఏపీని రోడ్ మోడల్‌గా నిలిపామన్నారు. కోవిడ్ సమయంలో సురక్షితంగా ఉన్నామనే భావన ప్రజల్లో కలిగిందన్నారు. మేనిఫెస్టోను సీఎం జగన్ వవిత్ర గ్రంథంగా భావించారని చెప్పారు. మేనిఫెస్టో అమలును గీటురాయిగా నిర్ణయించారని పేర్కొన్నారు. 2019లో ఏపీ జీఎస్డీపీ 22వ స్థానం, 2021-2022లో తొలిస్థానంలో ఉందన్నారు. అభివృద్ధి పరంగా అద్భుతమైన ప్రగతి సాధించామని సజ్జల వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed