దేశంలోనే ఆ ఫెసిలిటీ ఉంది చంద్రబాబుకే: మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-10-20 11:00:45.0  )
దేశంలోనే ఆ ఫెసిలిటీ ఉంది చంద్రబాబుకే: మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సెటైర్లు వేశారు. దేశంలో చాలా మంది అరెస్ట్ అయ్యారని.. చంద్రబాబు ఏమైనా పై నుంచి దిగివచ్చారా అని ప్రశ్నించారు. జైలులో ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్ ఇచ్చింది చంద్రబాబుకు మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు చేసిన పాపాలు ఊరికేపోవని విమర్శించారు. చంద్రబాబును ఏపీలో అరెస్ట్ చేస్తే తెలంగాణలో నిరసనలు ఏంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏమైనా దేవుడా అని, చట్టానికి అందరూ సమానమేనని కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.. వైసీపీ పాలనంతా స్కీములయితే చంద్రబాబు పాలన అంతా స్కాములేనని విమర్శించారు. రాష్ట్రంలో పేదరికాన్ని 6 శాతానికి తీసుకొచ్చిన ఘనత జగన్ దేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed