- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టుకు సూర్యనారాయణ.. మళ్లీ ఎందుకెళ్లారంటే..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టుకు ఉద్యోగ సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ మరోసారి ఆశ్రయించారు. ప్రభుత్వ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంఘం గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్లారు.
కాగా సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగానూ, ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కేఆర్ నారాయణ వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలపై రెండు చోట్ల పోరాటం చేస్తున్నారు. అంతేకాదు ఆ మధ్య గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సమయంలో ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని నోటీసులు జారీ చేసింది. వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దాంతో ఆ సంఘం నేతలు అప్పుడు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ నోటీసులను రద్దు చేసింది.
అయితే ఏడురోజుల క్రితం ప్రభుత్వం మరోసారి ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ సంఘానికి కూడా కేఆర్ నారాయణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆయన మరోసారి కూడా హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తాను పోరాటం చేస్తున్నందునే ఉద్యోగ సంఘాలను రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని కేఆర్ నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ కక్ష సాధింపులపై ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు.