Mangalagiri: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-08-04 12:16:52.0  )
Mangalagiri: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కాకూదడని తాను ఎప్పుడూ అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ మంగళగిరిలోనే తన నివాస స్థానమని చెప్పారు. విశాఖలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదని జోస్యం చెప్పారు. టికెట్ల కోసం జనసేన ఎవరి దగ్గర డబ్బుల తీసుకోదని తేల్చి చెప్పారు. టికెట్ల కోసం ఎవరైనా డబ్బు ఇస్తే వాళ్లదే బాధ్యతన్నారు. రాజకీయ ఆధిపత్యాన్ని జగన్ వదులుకోడని, సాధికారిత కోసం అధికారాన్ని జనసేన లాక్కోవాలని పవన్ సూచించారు.

‘ఇష్యూను డైవర్ట్ చేయడానికి నా సినిమాలపై మాట్లాడుతున్నారు. రాజకీయాల్లోకి సినిమాను తీసుకురావొద్దు. రాజకీయాలు నడిపేందుకు సినిమాలు నాకు ఇంధనం.’ అని పవన్ పేర్కొన్నారు.

Read More..

సినిమాలు నా ఇంధనం.. రాజకీయంతో ముడిపెట్టొద్దు : పవన్ కల్యాణ్

Advertisement

Next Story

Most Viewed