సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్

by srinivas |
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి స్వాగతించారు. ఉద్యోగులకు సంబంధించిన 5 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు. డీఏ జీవోలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామం అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేశారని ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మరోసారి న్యాయం చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కాంట్రాక్టు ఉద్యోగుల తరపున ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అలాగే కొత్త పీఆర్సీ కమిషన్ వేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు. సీపీఎస్ రద్దు చేస్తూ ‘ఏపీ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ బిల్లు-2023’ పేరుతో కొత్త పెన్షన్‌ విధానం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed