- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీఐసీఐ బ్యాంకుల్లో గోల్ మాల్.. వాళ్లేనంటూ మాజీ మేనేజర్ సెల్ఫీ వీడియో విడుదల
దిశ,వెబ్ డెస్క్: చిలకలూరిపేట(Chilakaluripet), నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు(Narasa Raopet ICICI Bank)ల్లో బంగారం, నగదు గోల్ మాల్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును సీఐడీ(CID) విచారిస్తోంది. ఇప్పటికే బ్యాంక్ అప్రైజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు బ్యాంక్ మాజీ మేనేజర్ నరేశ్(Former manager Naresh) కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మేనేజర్ నరేశ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తప్పంతా తనపై వేసి బలి చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంపునేపథ్యంలో పలు తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. విజయవాడ భారతినగర్ RS చంద్రశేఖర్, ఏలూరు రోడ్డు ప్రవీణ్ డబ్బులు తీసుకున్నారని తెలిపారు. నరసరావుపేటలోని కరుణాకరన్, వంశీ, చిలకలూరిపేటకు చెందిన హరీష్‌కి అన్ని విషయాలు తెలుసని పేర్కొన్నారు. తనపై వేసిన నిందతో చనిపోవాలని అనుకున్నానని, కానీ భార్య, పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయానని తెలిపారు. జంగారెడ్డిలో కంచర్ల విష్ణు ప్రసాద్, పులిపాక ఉమామహేశ్వరరావు నుంచి 5 నుంచి 6 కోట్ల రూపాయలు రావాలని తెలిపారు. ప్రభు శేఖర్, కిరణ్ ఇద్దరు త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తారని చెప్పారు.
అయితే నరేశ్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వివరాల ద్వారా సీఐడీ అధికారులు కూపీ లాగుతున్నారు. నరేశ్ చెప్పిన వాళ్లందరి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నరేశ్ కోసం గాలిస్తున్నారు.