వద్దన్నా.. ఫోన్‌ మాట్లాడుతున్న కూతురు.. కోపంతో తండ్రి దారుణం

by srinivas |
వద్దన్నా.. ఫోన్‌ మాట్లాడుతున్న కూతురు.. కోపంతో తండ్రి దారుణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్ చదువుతున్న కుమార్తె నిత్యం ఫోన్‌లలో బిజీబిజీగా గడుపుతుంది. ఫోన్ పక్కనపెట్టి చదువుకో అమ్మా అని తండ్రి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థిని తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే తండ్రి లేని సమయంలో డాబాపైకి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. ఫుల్‌గా మద్యం సేవించి అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రి కుమార్తె ఫోన్ మాట్లాడటం చూసి ఇంటిపై నుంచి కిందకు తోసేశాడు.

ఈ విషాద ఘటన ఉమ్మడి గుంటూరు జిల్లా ఎడ్లపాడులో చోటు చేసుకుంది. ఉన్నవ గ్రామంలో ఓ కుటుంబం నివసిస్తోంది. దంపతులకు ఇంటర్ చదువుతున్న కుమార్తె నిత్యం ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తండ్రికి అనుమానం వచ్చింది. పలుమార్లు మందలించినప్పటికీ విద్యార్థినిలో ఎలాంటి మార్పురాలేదు. అయితే తండ్రి ఇంటికి రాకపోవడంతో డాబాపైకి వెళ్లి కుమార్తె ఫోన్‌లో మాట్లాడుతుంది. అప్పుడే బయట నుంచి ఫుల్‌గా మందుకొట్టి ఇంటికి వచ్చిన తండ్రి.. కూతురు డాబాపై సెల్ ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. కోపంతో రగిలిపోయాడు. అంతే మద్యం మత్తులో డాబా మీద నుంచి ఆవేశంగా కిందకు తోసేశాడు. దీంతో విద్యార్థిని తల్లి శోభారాణి బాలికను గుంటూరు జీజీ‌హెచ్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story