Ap News: 30 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్.. తీరు మార్చుకోవాల్సిందేనని హెచ్చరిక

by srinivas |   ( Updated:2023-02-13 15:29:02.0  )
Ap News: 30 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్.. తీరు మార్చుకోవాల్సిందేనని హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పని తీరుపై చేసిన సర్వే రిపోర్టును వివరించారు. 30 మంది ఎమ్మెల్యేలు పని తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పని తీరు మెరుగుపర్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో చెప్పినా పని తీరు మార్చుకోని నేతలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు అతి తక్కువ రోజులు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కూడా మండిపడ్డారు. సమావేశంలో వివరాలను సీఎం బయటపెట్టి వార్నింగ్ ఇచ్చారు. పని తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమని తేల్చి చెప్పారు.

విస్తృతంగా చేపట్టాలి..

అలాగే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. 'జగనన్నే మా భవిష్యత్తు' పేరిట కార్యక్రమం చేపట్టాలని ఎమ్మెల్యేలు, నేతలకు సూచించారు. మార్చి 18 నుంచి 26 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని వారికి సీఎం జగన్ ఆదేశించారు. అలాగే కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గృహసారథులు, కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలని సీఎం జగన్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లాల్లో కార్యక్రమం నిర్వహణపై కూడా ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో విస్తృతంగా 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Also Read..

మంత్రి రోజాపై Nara Lokesh తీవ్ర వ్యాఖ్యలు.. ఆమె ఓ డైమండ్ పాప అంటూ సెటైర్స్

Advertisement

Next Story

Most Viewed