- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Good News: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నిధులు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను శనివారం విడుదల చేయనున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారుల ఖాతాలో జమచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన తర్వాత ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి సీఎంవో కార్యాలయం షెడ్యూల్ విడదల చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 - 12.35 బహిరంగ సభలో వైఎస్ఆర్ ఆసరా ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నాం 1.05గంటలకు దెందులూరు నుంచి బయలు దేరి 1.35గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడం.. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందడం వైసీపీలో గందరగోళం నెలకొంది. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన...సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి: