- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:పల్నాడులో జల్ జీవన్ ప్రాజెక్టులోని అవాంతరాలను తొలగించండి: MP లావు శ్రీకృష్ణదేవరాయలు
దిశ ప్రతినిధి,గుంటూరు:పల్నాడులో జగజీవన్ ప్రాజెక్టు ముందుకు వెళ్లడంలోని అవాంతరాలను తొలగించి ప్రతి ఇంటికి నీరందించెందుకు సహకరించాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ పై సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రూ. 350 కోట్లు నిధులు మంజూరయి ఉన్నాయని అన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటిని నింపి, అక్కడి నుంచి ప్రతి ఇంటికి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, కానీ పల్నాడులో ఈ ట్యాంక్‌లను నింపేందుకు నీటి కొరత ఉందని, కొన్ని ప్రాంతాల్లో దాదాపు 1200 అడుగులు బోర్లు వేస్తేనే నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు.
ఈ స్థితిలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో నీటి సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని, పెద్ద మొత్తంలో మంజూరైన నిధులు వృథా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్ర జల వనరుల మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ..పలు సమావేశాల్లో ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యాయని, పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి, నీరు ఎక్కడ లభ్యమవుతుంది అని, ఎక్కడ బోర్లు వేస్తే నీరు పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చని, కొన్ని గ్రామాల్లో అవసరాన్ని బట్టి రెండు బోర్లు కూడా వెయ్యాల్సి వస్తోందని బదులిచ్చారు.