- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతికి మద్దతిస్తే దాడి చేస్తారా..?.. ఎంపీ నందిగాం సురేశ్‌పై రమేశ్ నాయుడు మండిపాటు
దిశ, వెబ్ డెస్క్: అమరావతి మందడం వద్ద బీజేపీ నేత సత్యకుమార్ రాజు కాన్వాయ్‌పై దాడి చేసింది వైసీపీ మూకేనని బీజేపీ నేత రమేశ్ నాయుడు ఆరోపించారు. ఎంపీ నందిగాం సురేశ్ అనుచరులే తమ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వి.. బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆయన స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమపై దాడులకు తెగబడటం జరిగిందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చర్యలకు ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికార పార్టీ తప్పిదాలను ప్రశ్నించడం తమ నైతిక బాధ్యత అని సూచించారు. ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం బాధాకరమైన విషయమన్నారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తమ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘ఆందోళనకారులను ప్రోత్సహిస్తూ వెనుక నుంచి రాళ్లు రువ్విస్తూ మా వెహికల్‌పై పడేటట్లు చేశారు. మా కార్యక్తలపై వైసీపీ కార్యకర్తలు భౌతికదాడులకు దిగారు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. అమరావతికి మద్దతు ఇస్తే దాడుల చేస్తాం. భయపడేతాం. అంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు.బీజేపీ కార్యకర్తలు ఇలాంటి సంఘటనలను చాలా చూశారు. నక్సలైట్లతో పోరాడిన చరిత్ర బీజేపీది.’ అని రమేశ్ నాయుడు తెలిపారు.
కాగా బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళన 1200వ రోజుకు చేరింది. అయితే మద్దతు తెలిపేందుకు సత్యకూమార్ అక్కడకు వెళ్లారు. దీక్షా శిబిరం వద్ద రైతులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం తుళ్లూరులోని బీజేపీ నాయకుడిని పరామర్శించి వెళ్తున్న సమయంలో మందడం దగ్గర కొందరు వైసీపీ కార్యకర్తలు ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్‌లోని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.