- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Somu Veerraju: రాహుల్‌కి శిక్ష సరైనదే
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీకి కోర్టు శిక్ష విధించడాన్ని సోము వీర్రాజు స్వాగతించారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు శిక్ష విధించిందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీకి శిక్ష సరైనేదని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బీజేపీ పార్టీ పట్టణ, మండల అధ్యక్షుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో ఉందన్నారు. రాష్ట్రంలో వనరులు దోపిడీకి గురవుతున్నాయని.. అక్రమ దందాలపై బీజేపీ ఉద్యమిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఇప్పటికీ జనసేన, బీజేపీ కలిసే ఉందన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.