Cm Jaganపై ఏపీజేఏసీ అమరావతి సీరియస్.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన

by srinivas |
Cm Jaganపై ఏపీజేఏసీ అమరావతి సీరియస్.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం కార్యాచరణ ప్రకటించింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఇంతకాలం ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇప్పటివరకూ పట్టించుకోకపోవడంపై సీరియస్ అయింది. ఉద్యమ తీవ్రతను ఉధృతం చేశారు. ఏపీజేఏసీ అమరావతి కార్యవర్గం విజయవాడలో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 9 నుంచి నిరసనలు

మార్చి 9, 10న నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అలాగే మార్చి 13, 14న భోజన విరామ సమయంలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టాలని పిలుపు నిచ్చారు. మార్చి 15,17, 20న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సూచించారు. మార్చి 21 నుంచి వర్క్ టు రూల్, సెల్ ఫోన్ డౌన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మార్చి 24న హెచ్‌వోడీ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టనున్నారు. మార్చి 27న కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కలవాలని నిర్ణయించారు.

రెండో దశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం

ఏప్రిల్ 1న వివిధ అంశాలపై నిరసన తెలపనున్నారు. ఏప్రిల్ 3న ప్రతి జిల్లాలో చలో స్పందన కార్యక్రమం, వినతి పత్రాల అందజేత, ఏప్రిల్ 5న రాష్ట్రాస్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించాలని ఏపీజేఏసీ అమరావతి కార్యవర్గం నేతలు నిర్ణయించారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే రెండో దశ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ప్రకటించారు.

Advertisement

Next Story