Amaravati: పేదల ఇళ్ల నిర్మాణంపై వేగం పెంచిన ప్రభుత్వం.. అధికారులకు కీలక ఆదేశాలు

by srinivas |
Amaravati: పేదల ఇళ్ల నిర్మాణంపై వేగం పెంచిన ప్రభుత్వం.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఆర్డీయేలో ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇల్లు లేని పేదలకు త్వరగా ఇల్లు ఇవ్వాలని తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఇళ్లు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇళ్లు కట్టి అప్పగించడంపైనా ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అలాగే సీఆర్డీయే ప్రాంతలో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

ఇక సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల్లో ఇళ్ల కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 3.70 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బేస్ మెట్ లెవల్ దాటి వివిధ దశల్లో 8.64 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రూఫ్ లెవల్.. ఆపైన 5.01 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని సీఎం జగన్ కు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story