ప్రకాశం జిల్లాలో అనుమానాస్పద వైరస్ కలకలం.. వృద్ధురాలి పరిస్థితి విషమం..?

by srinivas |   ( Updated:2025-02-16 14:15:00.0  )
ప్రకాశం జిల్లాలో అనుమానాస్పద వైరస్ కలకలం.. వృద్ధురాలి పరిస్థితి విషమం..?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో అనుమానాస్పద వైరస్ కలకలం రేపింది. కమలమ్మ అనే వృద్ధురాలికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం(High Fever)తో కమలమ్మ ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ తర్వాత రోజు కాళ్లు చచ్చిపడిపోయాయి. అంతేకాదు పక్షవాతం కూడా వచ్చింది. దీంతో ఆమెను నెల్లూరు ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడి వైద్యుల(Doctors) సూచనలతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కమలమ్మ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలసందలపల్లిలో శానిటేషన్ నిర్వహించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అందరికి రక్త పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ శాంపిల్స్‌‌తో పాటు గ్రామానికి సరఫరా అవుతున్న వాటర్ నమూనాలను సైతం ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వస్తేగాని ఏదనేది చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో కూడా గ్రామంలో ఇలాంటి జ్వరాలు వచ్చాయని స్థానికులు చెప్పారని అధికారులు చెబుతున్నారు.

Next Story