కడప జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

by samatah |
కడప జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 27న ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా అధికారులు గవర్నర్ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈనెల 27న ఉదయం 11.40కి కడప ఎయిర్ పోర్టుకు గవర్నర్ చేరుకుంటారని తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు కడప అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనలు చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 1.45 గంటల వరకు ఒంటిమిట్ట కోదండరాముడి దర్శనం చేసుకుంటారని ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతికి పయనమవుతారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story