- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:‘ప్రభుత్వ తీరు బాధాకరం’..వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ,వెబ్‌డెస్క్:అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని జగన్ అభిప్రాయపడ్డారు. నేడు (శుక్రవారం) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ ఘటన పై వైఎస్ జగన్ మాట్లాడుతూ..ప్రభుత్వం వేగంగా స్పందించలేదని ఆరోపించారు. మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లలేదని ఫైరయ్యారు. అంబులెన్స్‌లు సమయానికి రాలేదు. బాధితులను కంపెనీ బస్సుల్లో ఆసుపత్రికి తీసుకొచ్చారు. కార్మిక శాఖ మంత్రి ఏమి తెలియనట్టు మాట్లాడారని వాపోయారు.
నేను సీఎంగా ఉండగా ఎల్‌జీ పాలిమర్స్ ఘటన జరిగితే గంటల్లో వెళ్లా అని వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన బాధితులకు ఇంకా పరిహారం అందలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. వారంలోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్ లైన్ విధించారు. వారంలో పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.