BREAKING: ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీల చర్చలు విఫలం

by Satheesh |   ( Updated:2023-12-26 15:31:54.0  )
BREAKING: ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీల చర్చలు విఫలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఇటీవలే జీతాలు పెంచామని.. ఇప్పుడు మరోసారి జీతాల పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంగన్ వాడీలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మె విరమించాలని మంత్రి బొత్స అంగన్ వాడీలను కోరారు. బాలింతలు, గర్బిణీలు, చిన్న పిల్లల ఆరోగ్యం దృష్ట్యా అంగన్ వాడీలు రేపటి నుండి విధులకు హాజరు కావాలని కోరారు. తమది మహిళ పక్షపాత ప్రభుత్వం అని.. ఇప్పటికే అంగన్ వాడీల చాలా డిమాండ్లు పరిష్కారించామని తెలిపారు. ఇప్పటికిప్పుడే జీతాల పెంపు సాధ్యం కాదని.. వేతనాల పెంపుకు కొంత సమయం కావాలన్నారు.

సంక్రాంతి తర్వాతో మరోసారి చర్చిద్దామని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించకపోవండంతో అంగన్ వాడీల తదుపరి కార్యచరణ ఏంటన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న వేళ ప్రభుత్వానికి అంగన్ వాడీల సమస్య తలనొప్పిగా మారింది. ఎన్నికల నేపథ్యంలో అంగన్ వాడీల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనుకున్నప్పటికీ.. సర్కార్ మాత్రం జీతాలు పెంచలేమని తేల్చి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గత 15 రోజులుగా జీతాల పెంపు కోసం అంగన్ వాడీలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story