Breaking: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం

by srinivas |   ( Updated:2023-06-06 02:49:40.0  )
Breaking: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2014 జూన్ 2కి ముందు ఐదేళ్లు పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పీఆర్సీ కమిషన్‌పై ఎల్లుండి కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే జీపీఎస్‌కు తుది మెరుగులు దిద్ది కేబినెట్‌లో చర్చించనున్నారు. ఏడాదికి నాలుగు వాయిదాల చొప్పున పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లింపునకు సైతం జగన్ సర్కార్ అంగీకారం తెలిపింది.

కాగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను పొడిగిస్తూ వచ్చారు. దీంతో పలుమార్లు కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను పర్మినెంట్ చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రుల కమిటీతోనూ పలు దఫాలు చర్చించారు. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు వారిని పర్మినెంట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story