AP Government:6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం

by Jakkula Mamatha |
AP Government:6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం(AP Government) డైరెక్టర్లను నియమించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే తొలివిడత నామినేటెడ్ పోస్టులు(Nominated Posts) భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల రెండో విడత నామినేటెడ్ పోస్టులను కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా 6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన , ఒక బీజేపీ నేతకు డైరెక్టర్‌గా అవకాశం కల్పించింది. కార్పొరేషన్‌లు 15 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 90 మందిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story