AP Assembly: సాగునీటి సంఘాలతో సత్ఫలితాలు: మంత్రి నిమ్మల

by Anil Sikha |
AP Assembly: సాగునీటి సంఘాలతో సత్ఫలితాలు: మంత్రి నిమ్మల
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాగునీటి సంఘాలతో సత్ఫలితాలు వస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. బుధవారం అసెంబ్లీ (Assembly) సమావేశంలో పలువురు సభ్యులు ప్రస్తావించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాలకు సంబంధించి 60 వేల మంది ఆయకట్టు రైతులకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. వీరంతా ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పనిచేస్తూ కాల్వల సమర్థ నిర్వహణకు సాయపడుతున్నారని మంత్రి చెప్పారు. కొన్ని నియోజకవర్గాలలో నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు వాళ్ళ సొంత నిధులతో అత్యవసర పనులు చేసుకోవడం ఎంతో శుభపరిణామమన్నారు. సాగునీటి సంఘాల గొప్ప వ్యవస్థను జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో నీరు కార్చింది అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు యుద్ధ ప్రాతిపదికన సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి నీటిపారుదల రంగంలో రైతులకు భాగస్వామ్యం కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. ఓ అండ్ ఎం పనులు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల అనేక అవకతవకులు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో ఓ అండ్ ఎం పనులు చేసి, కొన్నిచోట్ల అసలు చేయకుండానే బిల్లులు కాజేసిన అనేక ఉదంతాలు నా దృష్టికి వచ్చాయి. అలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్న బాధ్యుల్ని సస్పెండ్ చేస్తామని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 5 లక్షల లోపు ఓ అండ్. ఎం పనులు, ఇతర అత్యవసర పనులు నీటి సంఘాలకు నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పద్ధతి ఇప్పుడు ఉంది. ఈ మొత్తాన్ని 10 లక్షలు పెంచి ఆ పనులను నీటి సంఘాల తోనే చేయించే ఆలోచన కూడా ముఖ్యమంత్రి మదిలో ఉందని నిమ్మల చెప్పారు. డెల్టాల (Delta) ఆధునికీకరణ ద్వారానే రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకోగలమన్నారు.

Next Story

Most Viewed