గుడ్ న్యూస్: వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..విమ్స్‌లో సైతం

by Seetharam |
AP government
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో వెనువెంటనే భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రిక్రూట్మెంట్ కు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా వున్న దాదాపు 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వాకిన్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ /లాటరల్ /కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య సర్వీసుల రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్‌బీ) మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన(డైరెక్ట్/లేటరల్) భర్తీ చేస్తామని ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోస్టులకు గాను ఈ నెల 18, 20 తేదీలలో విజయవాడ హనుమాన్ పేట పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ) కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాకిన్ రిక్రూట్మెంట్ జరుగుతుందని ప్రకటనలో వెల్లడించారు. అలాగే విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)విశాఖపట్నంలో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 15న విశాఖపట్నం హనుమంతవాక జంక్షన్‌లోని విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్యాలయంలో ఉ.10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాకిన్ రిక్రూట్మెంట్ జరుగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్ధులు ఆయా తేదీలలో నిర్ణీత ప్రదేశాలలో జరిగే వాకిన్ రిక్రూట్మెంట్ కు స్వయంగా హాజరు కావాలని కోరారు. అర్హతా ప్రమాణాలు, ఇతర మార్గదర్శకాల కోసం https://dme.ap.nic. వెబ్ సైట్ ను చూడాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed