AP Pensions:గుడ్ న్యూస్.. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

by Jakkula Mamatha |
AP Pensions:గుడ్ న్యూస్.. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పేరుతో పెన్షన్‌లను రూ. 4 వేలకు పెంచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్(Pension) అందించడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ కింద మొత్త 64,14,174 మంది పెన్షన్‌ పొందుతున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు ఇలా మొత్తం 26 రకాల వ్యక్తులకు పెన్షన్‌ అందుతోంది.

ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్లు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త పెన్షన్ లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ.. అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలను ప్రకటించనున్నారు. ఇక పెన్షన్‌ దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా వచ్చే నెలలో పెన్షన్‌ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అనర్హులు పెన్షన్‌ తీసుకుంటునట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed